సాంస్కృతిక చైతన్యం రగిలించిన కవి యోధుడు దాశరథి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 22
సాంస్కృతిక చైతన్యo రగిలించిన కవి యోధుడు దాశరథి అని తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. మంగళవారం జులై 22వ తేదీన కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో
దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను నిర్వహించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి దాశరథి ఆనాడు రకరకాల హింసను ఎదుర్కొంటున్న తెలంగాణను చూసి చలించిపోయి పీడిత ప్రజల గొంతు గా మారి నినదించి చైతన్యవంతమైన పాత్రను పోషించి సాంస్కృతిక చైతన్యం రగిలించిన కవి యోధుడు దాశరథి తెలంగాణ ప్రాంతం గర్వించదగిన గొప్ప కవి అన్నారు.
ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పూలమాలలు, వేసి మాట్లాడుతూ కఠిన నిర్బంధాలను సైతం ఎదుర్కొని ప్రజల గొంతుకగా గర్జించిన దాశరథి తెలంగాణ కోసం ఎన్నో రచనలను చేశారని ఆ రచనలన్నీ నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని దాశరథి కృష్ణమాచార్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కవులు రచనలు చేయాలని పిలుపునిచ్చారు.
దాశరథి ప్రజా చైతన్యం తీసుకువచ్చే రచనలతో ప్రేరేపితమై ఆరోజు ప్రతివారు తెలంగాణ భావజాలాన్ని గుండెల్లో నింపుకున్నారని, అలాంటి నేటి కవులను కన్నా తెలంగాణ ప్రాంతం ఎంతో గొప్పదని ప్రజా కవులకు తెలంగాణ పురిటిగడ్డ, లాంటిదని ఎందరో మహానుభావులు ఈ నెల పై జన్మించారని, వారి వారసత్వాన్ని తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో అల్లి మోహన్ రాజ్ ,
నాగభూషణం, రామచంద్రం, సుధాకర్, చంద్రకాంత్, లింగం, తిరుపతి రావు, బాలరాజయ్య, కిషన్
తదితరులు పాల్గొన్నారు.