ప్రజలు అనారోగ్యకరమైన అలవాటును దూరం పెట్టి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి

*ప్రజలు అనారోగ్యకరమైన అలవాటును దూరం పెట్టి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి*

*జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరం*

*జమ్మికుంట జులై 22 ప్రశ్న ఆయుధం*

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ప్రజలు అనారోగ్యకరమైన అలవాట్లను దూరం పెట్టి సమతుల్యతతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్ ముక్క శరత్ బాబు డాక్టర్ మౌనిక జమ్మికుంట మాజీ ఎంపీపీ దొడ్డే మమతా దుర్గాప్రసాద్ అన్నారు మంగళవారం రోజున జన వికాస ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీ కార్తికేయ ఆసుపత్రి వైద్యులతో జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు పాల్గొన్న డాక్టర్ ముక్కా శరత్ బాబు ముక్కా మౌనిక మాజీ ఎంపీపీ దొడ్డే మమత దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావడానికి అనారోగ్యకరమైన అలవార్డును విడిచిపెట్టి సమతుల్యతతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వారు కోరారు బాలవికాస సంస్థ చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుందని మండలంలో పలు గ్రామాలలో నిర్వహించిన వైద్య శిబిరాలలో దాదాపు వెయ్యి మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం మధురానుభూతిగా మిగిలిపోతుందని ప్రజల ఆరోగ్యాల పట్ల బాలవికాస సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు అనంతరం బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ప్రతి మహిళ వంటిల్లును వైద్యశాలగా మార్చాలని అలాగే శ్రీ కార్తికేయ హాస్పిటల్ వైద్యులను సంప్రదించగానే ఉచిత వైద్య శిబిరానికి అంగీకరించినందుకు వైద్యులకు కృతజ్ఞత తెలిపారు అనంతరం వైద్యులు ముక్కా శరత్ బాబు, ముక్కా మౌనికలకు జమ్మికుంట మాజీ ఎంపీపీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ ఆసియా, శ్రీ కార్తికేయ హాస్పిటల్ స్టాఫ్ సాంబయ్య, అలేఖ్య, శృతి , శ్రీనాథ్ ,పెద్దంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దొడ్డే అన్నపూర్ణ, మామిడాల తిరుపతిరెడ్డి, ఆశా వర్కర్ స్వరూప గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now