వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

— జిల్లాఎస్పి యం.రాజేష్ చంద్ర ఐపీఎస్

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జులై 23

 

తాడ్వాయి మండలంలోని సంతాయిపేట గ్రామ భీమేశ్వర ఆలయం వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్.

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయం, వద్ద వరద పరిస్థితిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్,స్వయంగా పరిశీలించారు. ప్రజలు పొలాలకు వెళ్లే సమయంలో, అవసరాల నిమిత్తం వాగులు దాటే సందర్భాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేకపోతే వాగులు దాటి వెళ్లకూడదు. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలి.అని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై మురళి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now