*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలెక్టర్ ఆకస్మిక తనికి*

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలెక్టర్ ఆకస్మిక తనికి*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 23

 

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు ఆకస్మిక తనకి నిర్వహించారు ఇట్టి ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు వైద్యాధికారి మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ దోమకొండ హాజరు లేనందున వారికి శోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలు మరియు ఆస్పత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు అన్న ఏమైనా వైద్యసేవలు అందించాలని అన్నారు.

Join WhatsApp

Join Now