ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

*ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

*తహసిల్దార్ కు మెమోరండము సమర్పించిన ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ*

*జమ్మికుంట జూలై 23 ప్రశ్న ఆయుధం*

దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నప్పటికిని ప్రభుత్వము స్పందించకపోవడం వలన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జే.ఏ.సీగా ఏర్పడి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వలన తిరిగి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మూడు దశల ఉద్యమానికి శ్రీకారం పెట్టడం జరిగిందని ఉపాధ్యాయులకు రావలసిన మెడికల్ బిల్లులు జిపిఎఫ్ బిల్లులు పెండింగ్లో ఉండి ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వము పట్టించుకోకపోవడం శోచనీయమని వెంటనే పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలని కరీంనగర్ జిల్లా డిటిఎఫ్ అధ్యక్షుడు ఆవాల నరహరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయుల పోరాట కమిటీ మూడు దశల పోరాటాన్ని చేపట్టినదని ఆగస్టు 23,24 తారీఖులలో మండల తాసిల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి కి వినతి పత్రం సమర్పించడం. ఆగస్టు 1వ తారీఖున జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆగస్టు 23న రాష్ట్రస్థాయిలో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించడం కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఈ ధర్నాలో పాల్గొంటూ మద్దతు తెలిపాలని, సమస్యల పరిష్కారం కొరకు చేసే పోరాటంలో అందరూ పాల్గొనాలని, టి.పి.టి.ఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి అవినాష్ ఉపాధ్యాయ మిత్రులను కోరినారు. జమ్మికుంట మండల తాసిల్దార్ కు మెమొరండం సమర్పించిన కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి.డిటిఎఫ్ మండల అధ్యక్షుడు బి.వేణుమాధవ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్, టి.పి.టి.ఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి అవినాష్ టి. పి.టి.ఎఫ్ జమ్మికుంట మండల జనరల్ సెక్రెటరీ కుమారస్వామి,పోతుల రాజయ్య,జి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now