*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి*
*మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్.. మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట జూలై 23 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి, పిట్టలవాడ, క్రిష్ణ కాలనీ, అంబేద్కర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ లోతట్టు ప్రాంతాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ సిడిఏంఏ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మే, జూన్ నెలలో డ్రైన్ లోని షిల్ట్ ను ముందుగానే తొలగించడం జరిగిందని రానున్న మూడు రోజులు వర్షాలు అధికంగా ఉన్నందున మున్సిపల్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ సిబ్బందిని మూడు టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని అత్యవసరమైన సమయంలో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువస్తే సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్ పెక్టర్ మహేష్, ఈ ఈ శ్రీ కాంత్, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.