ఎంపీడీవో కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ కరువు..

ఎంపీడీవో కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ కరువు..

దంతాలపెల్లి :దంతాలపెల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఉపాధి హామీ సెక్షన్లు కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించే ఉద్యోగి రెండు నెలల నుంచి ఉద్యోగానికి హాజరు కావడం లేదని తెలిసింది. ఉపాధి శాఖ లో కరువు పనికి సంబంధించిన మాస్టర్లు కొట్టడం,కొత్త జాబ్ కార్డు నెంబర్లు ఇవ్వడం అలాగే ఉపాధి కూలీలకు పేమెంట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది. దంతాలపెల్లి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో చాలా వరకు పనులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.తక్షణమే పై అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరొక కంప్యూటర్ ఆపరేటర్ ను విధుల్లోకి తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now