జర్నలిస్టుల, జనం సమస్యలపై కొట్లాడే సంఘం టి జె యూ : కప్పర ప్రసాదరావు టి జె యూ రాష్ట్ర అధ్యక్షులు 

జర్నలిస్టుల, జనం సమస్యలపై కొట్లాడే సంఘం టి జె యూ : కప్పర ప్రసాదరావు టి జె యూ రాష్ట్ర అధ్యక్షులు 

గజ్వేల్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలి 

 కెసిఆర్ ప్రభుత్వంలో జోకుడు సంఘాలకే న్యాయం జరిగింది 

రేవంత్ ప్రభుత్వంలో అదే జరుగుతుంది 

రేవంత్ రెడ్డి ఇది గమనిస్తే బాగుంటుంది 

ప్రశ్న ఆయుధం హైదరాబాద్, జులై 24

జర్నలిస్టుల జనం సమస్యలపై కొట్లాడే ఏకైక సంఘం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అని టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు. గురువారం ములుగు లో జరిగిన సిద్దిపేట కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కెసిఆర్ ప్రభుత్వంలో జోకులు సంఘాలకు మాత్రమే న్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదే జరుగు తుందని రేవంత్ రెడ్డి అని తెలుసుకుంటే బాగుంటుందన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది జర్నలిస్టులు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే అన్యాయం జరిగింది వారికే అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గజ్వేల్ లో ఇవ్వాలని ఇచ్చిన వారికే ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. నిరుపేదలైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేవరకు టీజేయు పోరాటం చేస్తుందని హెచ్చరించారు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అంటూ జర్నలిస్టులను అవమానించొద్దని చిన్న పత్రికలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్న సంగతి మరవొద్దు అన్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాలని అన్నారు. ఉచిత విద్య హెల్త్ కార్డులు ప్రభుత్వం అందించాల్సిన కనీస బాధ్యత అని కొంతమంది సంఘ నాయకుల మాట విని సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయలేకపోతున్నారని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నిజం తెలుసుకుని న్యాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర కార్యదర్శి కనకా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి, గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు గుడాల చంద్రశేఖర్ గుప్తా, గజ్వేల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎల్లం రాజు, సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్, బైరి ప్రభాకర్, శ్రీనివాస్, సాగర్, సత్యం, శ్రీకాంత్, భాను గౌడ్     తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now