పది ఏండ్ల నిరీక్షణ కళ నెరవేరిన వేల
పది ఏండ్లుగ అందని రేషన్ కార్డ్. ఇ ప్రభుత్వం ఇవ్వడంతో
సంతోషించిన లబ్ధిదారులు
ప్రశ్న ఆయుధం జుక్కల్ 24జులై
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని కుర్తి గ్రామం లో
నూతన రేషన్ కార్డ్,రేషన్ కార్డ్ లో పేరు నమోదు చేసుకున్న వారికి 52 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డ్ లను పంచాయతీ సెక్రెటరీ అందజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎన్ని దరఖాస్తులు పెట్టిన ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం దరఖాస్తు పెట్టిన 15 రోజులలోనే రేషన్ కార్డ్ లను ఇస్తున్నారు అని అన్నారు.
ఇ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..