మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ *అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్.*

ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 24 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజర మీసేవ కేంద్రాన్ని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ఈ డిస్టిక్ మేనేజర్ సైడేశ్వరరావు మరియు టీజీటీఎస్ డిస్టిక్ మేనేజర్ తో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇతనికి లో భాగంగా మీ సేవ కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయా? సిబ్బంది పనితీరు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై ఎలా స్పందిస్తున్నారు మరియు సమయపాలన పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను పరిశీలించారు. మీసేవ కేంద్రంలో ఉన్న రికార్డులను,ఫైలింగ్ విధానాలను ఈ సందర్భంగా తనకే చేశారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సేవలపై మీసేవ సిబ్బంది నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో నిత్యం ముడిపడి ఉన్న మీ సేవ కేంద్రాలు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. దీనిలో భాగంగా ప్రజలకు వేగవంతమైన సేవలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. మీసేవ కేంద్రాలలో నిర్వాహకులు అదనంగా రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now