పాపం ఆ గ్రామస్తులకు ఎన్ని కష్టాలో…?
♦️చెత్తగుట్టలు, నీటి గోతులు – చూడని అధికారులు..!
♦️జిల్లా కలెక్టర్ గ్రామన్ని సందర్శించి వారం కూడా గడవలేదు..!
♦️వేతనాలు లేని కార్మికులు – శుభ్రత మాయమై పోయింది..!
♦️పట్టించుకోని పాలకులు – ప్రజల కష్టాలకు పరిష్కారం ఎప్పుడు..?
♦️గ్రామం అంధకారంలో… అధికారులు ఎక్కడ..?
♦️మిషన్ భగీరథ మౌనం – ప్రజలు బిందెలతో పోరాటం!
♦️వజ్జేపల్లి సమస్యలు ముదిరినా… అధికారుల నుండి స్పందన శూన్యం..!
♦️వేతనాల లేమి, నీటి కొరత, చెత్త పాలిటికేనా..?
♦️తిరగని కన్ను… స్పందించని దిష్టి – అధికారుల వైపు నిలదీత
♦️”నీరు – నిప్పుల పంచాయితీ”గా మారిన వజ్జేపల్లి గ్రామం
♦️ఓ గ్రామ ప్రజల ఆక్రందనలకు – వినపడని అధికారుల చెవులు..!
♦️వేతనాలు లేని కార్మికులు – ప్రజలు దుర్వాసనలో ఊపిరాడక పోతున్న వైనం
_పాపం ఆ గ్రామస్తులకు ఎన్ని కష్టాలో_
– మూడు రోజులుగా రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే
– ఆ గ్రామంలో నీటి గోస
– మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు అందని వేతనాలు
– ఆ గ్రామం వైపు చూడని అధికారులు
ప్రశ్న ఆయుధం 25జులై, కామారెడ్డి
ఆ గ్రామంలో మూడు రోజులుగా రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, కుళాయిలో నీరు రాకపోవడంతో గ్రామ కూడలిలోని వాటర్ ట్యాంకు వద్ద మహిళలు పురుషులు సైతం నీటి కోసం తిప్పలు పడుతున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది గురించి తెలుసుకుంటే వారికి మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని అధికారులు సైతo మా గ్రామం వైపు చూడడం లేదని దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం వజ్జే పల్లి గ్రామ పరిస్థితి ఇది.
రోడ్లపై ప్రధాన కూడలిలో చెత్త….!!
గ్రామంలో రోడ్ల పైన ప్రధాన కూడలిలో చెత్త పేరుకుపోవడంతో కోతులు కుక్కలు అక్కడ ఉండే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా అక్కడి నుండి వెదజల్లే దుర్వాసనకు గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. దీంతోపాటు దోమలు వృద్ధి చెందుతే మలేరియా, డెంగ్యూ, డయేరియా తత్తర వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. అధికారులు మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులు వచ్చిన సమయంలో గ్రామంలోకి వచ్చి హడావిడి చేయడం తప్ప వాటిని అరికట్టడంలో విఫలమవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం తప్ప చేసింది ఏం లేదని పలువురు పేర్కొంటున్నారు.
నీటికి కటకట….!!
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజేపల్లి గ్రామంలో గత మూడు నాలుగు రోజులుగా కుళాయిల్లో నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రధాన కూడలిలో గల నీటి ట్యాంకుల వద్ద పురుషులు, మహిళలు, వృద్ధులు, అనే తేడా లేకుండా బిందెలు పట్టుకొని నీరు పట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఏ అధికారి కూడా ఆ గ్రామం గురించి పట్టించుకోవడం లేదు.
పత్తా లేని మిషన్ భగీరథనీరు..!!
గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీరు వస్తే ఏ గ్రామంలోనైనా నీటి కొరత ఉండదు.
మూడు నెలలనుండి అందనీ వేతనాలు, అందుకే వారు విధులు నిర్వహిస్తలేరా.. ?
వజ్జపల్లి గ్రామంలో పారిశుద్ధ గ్రామీణ కై గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వారు గ్రామం గురించి పట్టించుకోకపోవడంతో గ్రామంలో నీటి కొరత, చెత్త సేకరించకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడం తదితర సమస్యలతో గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మా గ్రామం వైపు చూసి మా సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.