ఉపాధి కల్పన & శిక్షణ శాఖ ITI/ ATC (II(రెండవ) – ఫేజ్ ) అడ్మిషన్లు నోటిఫికేషన్లు*

*ఉపాధి కల్పన & శిక్షణ శాఖ ITI/ ATC (II(రెండవ) – ఫేజ్ ) అడ్మిషన్లు నోటిఫికేషన్లు*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 25

 

విషయం: 2nd ఫేజ్ అడ్మిషన్లు తేదీ 22.07.2025 నుండి 31.07.2025 వరకు,

 

తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ వారి పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో (ITI) / అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్స్ (ATC) లలో ఉచితంగా అడ్మిషన్ పొంది వివిధ అదునాతనమైన పారిశ్రామిక కోర్సులలో శిక్షణ పొందడానికి 2025 –2026/27 విద్యా సంవత్సరానికి గాను రెండవ దశ (2 nd ఫేజ్ ):అడ్మిషన్లకు ధరఖాస్తుల స్వీకరణ తేది: 22.07.2025 నుండి 31.07.2025 వరకు జరుగుతాయని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐ.టి.ఐ) / ATC తాడ్వాయి ప్రిన్సిపాల్ శ్రీ జి. కనకయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

14 సం.. పైబడిన అభ్యర్ధులు అర్హులని, అడ్మిషన్లుకు వయస్సు పరిమితులు లేవని మరియు నోటిఫికేషన్, వివిధ కోర్సుల విద్యార్హతలకు website: https://iti.telangana.gov.in/ చూడాలని సూచించారు. ITI/ ATC లలో సీట్లకి కొత్త అభ్యర్ధులు పైన తెలిపిన వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని ITI/ATC కోర్సుల ప్రతిపాధికన వెబ్ ఆప్షన్స్ పెట్టి అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు.

మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ఆధారంగా సీట్లు కేటాయించబడుతుందని తెలిపారు.

 

ప్రభుత్వ ITI/ATC తాడ్వాయి లో దాదాపుగా ఆరు అధునాతనమైన ట్రేడ్స్ ఉన్నాయి. కోర్సుల వివరాలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టీసీయన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫైయర్ , అడ్వాన్స్డ్ CNC మేషినింగ్ టెక్నీషియన్ మరియు మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులలో దాదాపుగా 172 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

 

ముఖ్య గమనిక:- ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తమ SSC మేమో ప్రకారం పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డు లలో ఉండేలా చూసుకుని ధరఖాస్తును సమర్పించాలి.

మరిన్ని వివరాలకు ప్రభుత్వ ITI /ATC తాడ్వాయి కార్యాలయము అధికారులను సంప్రదించాలని తెలిపారు.

9705255551

ఇట్లు.

ప్రిన్సిపల్

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ) / ATC తాడ్వాయి .

కామారెడ్డి జిల్లా.

Join WhatsApp

Join Now