అక్రిడేషన్ కార్డుల జారీకి ముందే పత్రికలను ఎంపానల్ చేయండి… కప్పర ప్రసాద్ రావు
చిన్న పత్రిక నిర్వహణ గగనంగా మారుతుంది
నెలకు 50 వేలు లేనిదే చిన్న పత్రికలను నిర్వహించడం సాధ్యపడదు
చిన్న పత్రికలకు జిల్లాకు నాలుగు అక్రిడేషన్ కార్డు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఏనిమిది చొప్పున ఇవ్వాలి
చిన్న పత్రికలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఓటమిపాలయ్యింది, రేవంత్ సర్కార్ అలా చేయదనుకుంటున్నాము
చిన్న పత్రికల బాగు కోసం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఎప్పుడు ముందుంటుంది
హైదరాబాద్: తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చిన్న పత్రికలపై కక్ష సాధింపులు చేస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. గత 11 సంవత్సరాల నుండి దాదాపు 300 పత్రికల వరకు ఎం ప్యానల్ మెంట్ నోచుకోలేక పేపర్ నిర్వహించడం గగనంగా మారుతున్న ఇప్పటివరకు ఎంపానల్ చేయకుండా అక్రిడేషన్ జారీ చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. పత్రికారంగానే అనగదొక్కడానికి గత కెసిఆర్ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నించింది సఫలమైంది కూడా అదే తరహాలో రేవంత్ రెడ్డి సర్కార్ సైతం చిన్న పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని దానికి సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సై అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎం పానెల్మెంట్ చేయక రేటు కార్డు ఇవ్వక చిన్న పత్రికల నిర్వహణ చేయడం చాలా ఇబ్బందికరంగా మారిందని ఒక్కొక్క పత్రిక నిర్వహించడానికి నెలకు 50,000 తప్పనిసరిగా చిన్న పత్రికల యజమానులు భరించాల్సి వస్తుంది. జర్నలిజం పిచ్చిలో చాలామంది ఇలా పత్రికల నిర్వహించుకుంటూ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఇంటి వాళ్లది బంగారం సైతం కుదబెట్టి నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎం పానెల్ ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామంటూ చిన్నపత్రికలపై కక్ష సాధింపులు చేసిన కేసీఆర్ సర్కార్ పత్త లేకుండా పోయింది. అదే తరహాలో ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా చిన్న పత్రికలను అనగదొక్కడానికి చూస్తోందా.? అందుకోసమే ఇప్పటివరకు ఎంపానల్ చేయడం లేదా అని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రశ్నిస్తోంది. మార్పు రావాలి అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికల నిర్వహణలో మార్పు వచ్చిన వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వానికి ఇంకా మార్పు రాలేదా అని చిన్న పత్రికల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. చిన్న పత్రికలను ఎం పానెల్మెంట్ చేసి ఒక్కొక్క జిల్లాకు నాలుగు అక్రిడేషన్ కార్డు చొప్పున ఇవ్వడంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలలో ఎనిమిది చొప్పున అక్రిడేషన్ కార్డుల జారీ చేస్తే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుందని దీనిపై తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ కూడా పలుసార్లు మంత్రి పొంగిలేటి దృష్టికి తీసుకువచ్చిన ఇప్పటివరకు స్పందించకపోగా ఇప్పుడు అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా మారింది. చిన్న పత్రికల సమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారులు, బిజినెస్ మెన్లు నిర్వహించే పత్రికల బాగు కోసమే ప్రభుత్వ ఆరాటం తప్ప చిన్న పత్రిక బాగు కోసం చిత్తశుద్ధి కరువైందని తెలంగాణ జర్నలిస్టుయూనియన్ మండిపడుతోంది. ఇప్పటికైనా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి చిన్న పత్రికలను ఎంపానెల్ మెంట్ చేసిన తర్వాతనే అక్రిడేషన్ జారీ చేయాలని చిన్న పత్రిక మంచి రేట్ కార్డు ఫిక్స్ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.