అనీమియా బాధితుడికి బి పాజిటివ్ రక్తం అందజేత.ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు.
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం)జులై 26
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రాములు (58) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ ను సంప్రదించారు. సమయానికి వారికి కావలసిన రక్తాన్ని సలీమ్ మానవతా ద్రుక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగింది. రక్తదానం చేసిన సలీమ్ కు అభినందనలను ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్లేట్ లెట్స్ అందజేయడానికి నిరంతరంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.