నాగుల పంచమి సందర్భంగా కామారెడ్డిలో పలుచోట్ల ప్రజలకు ఉచితంగా ఆవుపాలు పంపిణీ.
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం)జులై 29
జిల్లా కేంద్రంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా కామారెడ్డి మునిసిపల్ పరిధిలో పలుచోట్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని భరత్ రోడ్ లో బి డి ఎస్ ఎస్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ నాయకులు గెరిగంటి లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు ఉదయం 6 గంటల నుండి ఆవుపాలు పంపిణీ చేశారు. ఆవు పాలను భారత్ రోడ్, పెద్ద బజార్, భవాని రోడ్, కమ్మరి గల్లీ, స్టేషన్ రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్, చిన్న కసాబ్ గల్లీ, గడి రోడ్, పటేల్ గల్లీ ఏరియా ప్రాంత మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆవుపాల పంపిణీ నీ సద్వినియోగం చేసుకున్నారు. ఎన్జీవోస్ కాలనీలో శ్రీ ప్రసన్న రామాంజనేయ గుడిలో గుడి ఆధ్వర్యంలో ఆవు పాలను పంపిణీ చేయగా, విద్యానగర్ పాత సాయిబాబా గుడిలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవు పాలను పంపిణీ చేశారు.