ప్రశ్న ఆయుధం సుజత నగర్ మండల రిపోర్టర్ 30.7.2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అందించాల్సినటువంటి గోటి తలంబ్రాలు ఈరోజు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చిన్న కేశవ స్వామి ఆలయమునందు భక్తులు భజనలు చేసి నాటు వేసే వరి నారు ను ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని గ్రామ దేవతలను పూజించుకుంటూ ఊరేగింపుగా పొలం వద్దకు వెళ్లి చిట్లూరి అనురాధ కిషోర్ దంపతుల వారి పొలంలో గోటి తలంబ్రాలు కోసం వరి నాటు వేస్తూ శ్రీరామ జయరామ జయ జయ రామ జైశ్రీరామ్ అంటూ భక్తి గీతాలు పాడుతూ స్వామి వారి ఆశీస్సులతో కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు జూలూరుపాడు మండలం నుండి అలాగే తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కార్యాన్ని పూర్తి చేశారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన కృపకు పాత్రులు అయ్యారు అలాగే సుజాతనగర్ భక్త బృందం చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి భక్త మహాశయులకు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు
రాములోరి కళ్యాణం కోసం కోటి తలంబ్రాలు వరి నాట్లు వేసిన భక్తులు
by Naddi Sai
Published On: July 29, 2025 7:14 pm