ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..
కామారెడ్డి జిల్లా దోమకొండ
(ప్రశ్న ఆయుధం) జులై 29
బీబీ పేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బిబిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన మాందాపూర్, కోనాపూర్, బిబిపేట్ గ్రామస్తులకు చెందిన CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.