సాయి స్రవంతి కి అక్షర కణిక పురస్కారం 

సాయి స్రవంతి కి అక్షర కణిక పురస్కారం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం)జులై 29

 

కామారెడ్డి జిల్లా కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సాయి స్రవంతి జాదవ్ కు అక్షర కణిక పురస్కారం లభించింది. హైదరాబాద్ డి ఐఎమ్ సి డాన్స్ స్టూడియోలో కణిక సాహిత్య సామాజిక సేవ, విద్యారంగ వేదిక, కణిక ఆత్మీయ కలయిక సందర్భంగా సాహిత్య సేవలు అందిస్తున్నందుకు గాను, కణిక వ్యవస్థాపక అధ్యక్షురాలు కులకర్ణి రమాదేవి,ద్యాసం సేనాధిపతి, కణిక ప్రధాన కార్యదర్శి విజయ కుమారి, పొర్ల వేణుగోపాల్ చేతులు మీదుగా సాయి స్రవంతి జాదవ్, ను అక్షర కణిక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి సాయి స్రవంతి, మాట్లాడుతూ. తన సేవలను గుర్తించి అక్షర కణిక పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కణిక సభ్యులు, సత్యనీలిమ, వరలక్ష్మి, సుధా కొలచన,గిరిజ రాణి, దేవులపల్లి రమేశ్, కృష్ణకుమారి, భరద్వారాజ్, కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now