మహిళలకు & చిన్నారులకు భరోసా కేంద్రం విశ్వసనీయమైన సేవలు 

మహిళలకు & చిన్నారులకు భరోసా కేంద్రం విశ్వసనీయమైన సేవలు

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 29

 

 

మహిళలు మరియు చిన్నారులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది: జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి,

కామారెడ్డి జిల్లాలో బాధిత మహిళలు మరియు చిన్నారులకు న్యాయం, భద్రత, మనోధైర్యం కల్పించే ఉద్దేశంతో భరోసా కేంద్రం విశ్వసనీయంగా సేవలందిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పరిధిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, ఇప్పటికే నమోదు అయినా POCSO మరియు రేప్ కేసులలోని 13 మంది బాధితులకు, చెక్కులను అందజేయడం జరిగింది.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, ఆదేశాల మేరకు, బాధితుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ తక్షణ సహాయ నిధిని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, బాధితులకు భరోసా నిధి, చెక్కుల రూపంలో అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ,

ఈ ఆర్థిక సాయంతో వారు స్వల్పంగా అయినా పునరావాసం ప్రారంభించగలరని ఆశిస్తున్నాం. ప్రతి మహిళా మరియు బాలిక గౌరవంగా, స్వతంత్రంగా, జీవించాలన్నదే భరోసా కేంద్రం యొక్క అభిలాష అన్ని అన్నారు.

అలాగే, ఈ ఆర్థిక సహాయం బాధితులు కుట్టు మిషన్లు కొనుగోలు చేయడం, విద్యా అవసరాలు తీర్చుకోవడం, ఆరోగ్య సంబంధిత చికిత్సలు పొందడం, స్వతహాగా జీవించేందుకు ఉపాధి సాధనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ మురళి, రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) సంతోష్ కుమార్, ఉమెన్ ఎస్సై జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కవిత, ఇతర భరోసా సిబ్బంది, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now