కూల్చిన ఆలయాన్ని పునర్ నిర్మించడమే లక్ష్యం
ప్రశ్న ఆయుధం జులై29: కూకట్పల్లి ప్రతినిధి
బంజార హిల్స్ రోడ్ నెంబర్-12 ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ ఆలయాన్ని ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే, వరుసగా ఈ ఆలయానికి గడిచిన మూడు రోజుల నుంచి వివిధ హిందూ సంఘాలు హాజరై ఆలయ నిర్మాణానికి కదలి రావాలని పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు కావ్య, హైదరాబాద్ నగర అధ్యక్షులు రాజలింగం, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ సాగర్, జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ లతో కలిసి సోమవారం కూల్చివేసిన ఆలయాన్ని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని అన్నారు. కానీ 30-40 సంవత్సరాల పైచిలుకు పూజలు అందుకుంటున్న ఓ ఆలయాన్ని పూర్తిగా కూల్చివేయడంతోపాటు విగ్రహాన్ని మాయం చేయడం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలపై కట్టుబడి నాయకుని ఆదేశాల మేరకు శాంతియుతంగా ఆలయాన్ని సందర్శించి వెళ్లడానికి తాము వచ్చామని తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని న్యాయపరమైన పోరాటంలో తాము ముందుకు సాగుతామని ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం ఉంటుందని త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలవనున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, వేముల మహేష్ , ఎన్. నాగేంద్ర ,గడ్డం వీర ,పులగం సుబ్బు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.