తిరుమల సాయి విద్యార్థులను అభినందించిన ప్రభుత్వ విప్..
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 29 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తిమహేశ్వరరావు
విద్యార్దులు చదువులో ఉన్నత స్ధాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. మంగళవారం నాడు జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ లో గల తిరుమల సాయి హై స్కూల్లో 2024 – 2025 విద్యా సంవత్సరంలో నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పాఠశాలలో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయ సిబ్బందికి యూనిఫామ్ చీరలు అందజేశారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మించిన పాఠశాల ముఖాద్వారాన్ని కూడా ప్రారంభించారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆమె కోరారు. తిరుమల సాయి హై స్కూల్ లో చదువుకున్న 12 మంది విద్యార్థులకు నవోదయ సీట్లు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి నవోదయకు 137 మంది ఎంపిక కావడం హర్షనియమని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ సరళ కుమారి పాఠశాల ఎకడమిక్ డైరెక్టర్ రౌతు వెంకట్ రమణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీవడ శంకర రావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి రామారావు నాయుడు, అడ్డాకుల నరేష్ తదితరులు పాల్గున్నారు.