వినాయక నగర్‌లో రోడ్ల అవస్థలు… అభివృద్ధి కోసం విలవిల..!!
ఐదేళ్లుగా మౌనంగా ఉన్న పాలకులు..!
రోడ్లు లేవు… డ్రైనేజీలు కనిపించవు..!
వేసవిలో తాగునీటి కోసం శ్రమ..!
కాలనీవాసుల బతుకుల్లో కష్టాల పల్లకీలు..!
‘దయచేసి పట్టించుకోండి’ అంటున్న ప్రజలు
కామారెడ్డి, వినాయకనగర్, జూలై 30:
వినాయక నగర్ కాలనీ వాసులు అభివృద్ధి కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇక్కడ రోడ్డు గాని, డ్రైనేజీ గాని కనబడటం లేదు. మండే వేసవిలో తాగునీటికి పైప్ లైన్లు లేక ప్రజలు బిందెలు పట్టుకొని లైన్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి.
వర్షాకాలంలో బాటలు మురుగు కాల్వలుగా మారిపోతుండగా, ఎండల్లో మాత్రం ధూళి మబ్బులు కమ్ముకుంటున్నాయి. ప్రాథమిక సదుపాయాలకే ఆలోచించాల్సిన రోజుల్లో కూడా అధికారుల పట్టించుకోని ధోరణి ప్రజలను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
“ఒకసారి ఓ నాయకుడు వచ్చి ఓట్ల అడిగినప్పుడు మాత్రం కలనిలో అడుగుపెట్టాడు. తర్వాత ఎవ్వరి మొహాలు కనపడలేదు” అని అంటున్నారు అక్కడి పెద్దలు. “దయచేసి మేమూ మనుషులమే… మా జీవితం కూడా చక్కబడాలని ఆశిస్తున్నాం. కనీస వసతులు కల్పించండి” అంటూ బాధితులు వినవిస్తున్నారు.