అప్పటివరకు స్థానిక ఎన్నికలు వాయిదా పడే ఛాన్స్
అప్పటివరకు స్థానిక ఎన్నికలు వాయిదా పడే ఛాన్స్!తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చే వరకు స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 5న సీఎం రేవంత్ ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇండియా కూటమి మద్దతు కోరనున్నారు. బీసీ రిజర్వేషన్ల జాజ్కోసం అన్ని పార్టీల బీసీ నాయకులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఆలస్యమైతే నిధుల విడుదలలో ఇబ్బందులు వస్తాయని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు.