బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేస్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీసెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్‌రాజ్‌కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ఇవాళ(బుధవారం జులై 30) ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేస్‌లో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేస్ నమోదు చేశారు. జంగిల్ రమ్మీ యాడ్‌లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్. ఈ యాడ్‌ని ప్రమోట్ చేయడంతోనే ప్రకాష్‌రాజ్ పేరుని నోటీసులో చేర్చారు ఈడీ అధికారులు.
36 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన సినీసెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు పది రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతోనే ఎంతోమంది వీటికి అలవాటు పడి భారీగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే పలువురు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా బెట్టింగ్ యాప్స్‌పై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు..