ర్యాంప్ ఉమెన్ అక్సెలేరేషన్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం

 

*వీ హబ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా మహిళా పరిశ్రామికవేత్తలకు ర్యాంప్ ఉమెన్ అక్సెలేరేషన్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 30

 

*వీ హబ్* (Women Entrepreneurs Hub, Ministry of ITE&C, Govt. of Telangana) DRDA ఆధ్వర్యంలో జిల్లాలోని SHG మహిళలు మరియు మహిళా పరిశ్రామికవేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బడావత్ చందర్ మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.

 

వరల్డ్ బ్యాంక్ మరియు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ MSME ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు/ MSMEs లకు బిజినెస్ యక్షలరేషన్ సపోర్ట్ అందనుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాం లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మహిళా పరిశ్రామికవేత్తలకు తమ బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకొని తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది అని వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ తెలిపారు. దీనిలో భాగంగా టెక్స్టైల్స్, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్, మరియు హస్తకళలు వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ & డైవర్సిఫికేషన్, బ్రాండింగ్ & మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుంది అని వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఊహ తెలిపారు.

 

కాగా నిర్వహించిన ఈ బూట్క్యంప్ లో ఈ ప్రోగ్రాం పైన అవగాహన కల్పించి వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీ.ఆర్.డీ.ఓ సురేందర్, GM DIC లాలూ నాయక్, పీడీ మెప్మ శేఖర్ రెడ్డి, వీ హబ్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now