గుండె లోతుల్లోంచి…బండారు దత్తాత్రేయ..!

గుండె లోతుల్లోంచి…బండారు దత్తాత్రేయ..!

ఇది సుమారుగా మూడు తరాలుగా కొనసాగిన నా జీవనయాత్ర, కొన్ని దశాబ్దాలపాటు విస్తరించిన ప్రజాజీవన ప్రయాణం.

ఈ ఆత్మకథ నా జ్ఞాపకశక్తికి, చిత్తశుద్ధికి ఒక పరీక్ష. ఈ పరీక్షలో ఎంతవరకు కృతకృత్యుజ్ణయ్యాను పాఠకులే నిర్ణయించాలి.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కోవిడ్ కాలంలోనూ బిజీగా ఉంటూనే నేను సెల్ఫోన్లో డిక్టేట్ చేస్తుంటే రికార్డు చేసిన భాను శంకర్కై… చిత్తు ప్రతిని క్రమబద్దంగా మార్పు, కూర్పు చేసిన జర్నలిస్ట్ మిత్రుడు బాలసుబ్రహ్మణ్యంకీ…

ఆశుశైలిలో రాసిన చిత్తుప్రతిని ఎడిట్ చేసి ఒక రూపానికి తెచ్చిన కవి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి కీ…

నా మనోభావాల్ని, ఆయా సందర్భాలలో నా భావోద్వేగాల్ని అక్షరబద్ధం చేసి, పఠనీయత పెంచేలా ఈ ఆత్మకథను రూపొందించటంలో నాకు సహకరించిన పాత్రికేయుడు, పాత మిత్రుడు వల్లీశ్వర్కి (ఎమెసో…

అలాగే నా రాజకీయ జీవితకథని ఒక క్రమపద్ధతిలో కూర్చటంలో శ్రమించిన నా ఆత్మీయుడు, శాసన మండలి మాజీ సభ్యుడు కపిలవాయి దిలీప్ కుమార్కీ, సోదరీమణి లహరికీ… ఎంతో అందంగా కవర్ పేజీ డిజైన్ చేసిన జి. పురుషోత్ కుమార్ కీ, ఎమెస్కో సిబ్బందికీ…

నా ఏడు దశాబ్దాల జీవనయానంలో ఎక్కడెక్కడి సంఘటనల తాలూకు పత్రాలను, ఫోటోలను, పత్రికల వార్తలను ఎంతో శ్రమపడి సేకరించిన నా వ్యక్తిగత సహాయకులు కైలాస్ నాగేష్, రామగుండం మహేశ్, రమణలకు… మాటల్లో వ్యక్తం చేయలేనన్ని ధన్యవాదాలు.

నేను కోరగానే నామీద ప్రేమతో ఈ పుస్తకాన్ని అందంగా, పఠనీయంగా ప్రచురించిన ఎమెస్కో అధినేత విజయకుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు.

ఇంకెందరో… అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

బండారు దత్తాత్రేయ

Join WhatsApp

Join Now