ఆగస్టు నెలలో టీటీడీ తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
ఆగస్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
ఆగస్టు 7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి.
ఆగస్టు 8న శ్రీ ఆళవందారుల వర్ష తిరు నక్షత్రం.
ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి గరుడసేవ.
ఆగస్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు.
ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం.
ఆగస్టు 17న తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవం.
ఆగస్టు 25న బలరామ జయింతి, వరాహ జయంతి.