శైలంలో వెలమ గదుల ప్రారంభోత్సవము

శైలంలో వెలమ గదుల ప్రారంభోత్సవము

ప్రశ్న ఆయుధం జూలై 30: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్వామివారి కృప పట్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా భగవంతుని ఆశీస్సులు కోరారు.

అనంతరం శైలంలో నూతనంగా నిర్మించిన వెలమ గదుల సముదాయము ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు కొండల రావు ఈసందర్భంగా దాతలను సత్కరించి సన్మానించడం జరిగింది.

Join WhatsApp

Join Now