సుజాతనగర్ ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీ

ప్రశ్నఆయుధం సుజాతనగర్ నగర్ మండల రిపోర్టర్
సుజాతనగర్ ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు చెప్పారు. అనుమతులు లేకుండా రోడ్డు పక్కన పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. వేడుకల కోసం నిర్మిస్తున్న ఫ్లెక్సీల విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు

Join WhatsApp

Join Now