కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ శ్రీ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

 

కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ శ్రీ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జి

 

(ప్రశ్న ఆయుధం)జులై 31

కమిటి ద్వారా ఆర్టీసీలో సేవల మానం పెరగాలని ఆకాంక్ష.

 

రీజినల్, జిల్లా స్థాయి నేతలు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది.

 

సంఘం అధ్యక్షుడు కార్యకర్తల మధ్య పరస్పర ఐక్యత, సంగబలం పట్ల హర్షం.

 

నూతన కమిటీకి సంఘంలో క్రియాశీల పాత్ర ఉండాలని సూచన.

 

తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ ,ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో లో నిర్వహించిన నూతన కమిటీ పరిచయ సభ ఘనంగా జరిగింది ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా కామారెడ్డి డిపో మేనేజర్ కరుణా శ్రీ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి ఎస్సీ ,,ఎస్టీ ఉద్యోగుల సంఘాలు నిలుస్తున్నాయి . కొత్తగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా కమిటి బాధ్యతలతో కూడిన సేవలను అందించాలని కోరుకుంటున్నాను,అని తెలిపారు . ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను . ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కామారెడ్డి డిపోకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా రీజినల్ సెక్రటరీ మధుకర్, రీజినల్ అసిస్టెంట్ సెక్రటరీ మోహన్, రీజినల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్, ప్రచార కార్యదర్శి దత్తాద్రి, జిల్లా అధ్యక్షులు మధు, సెక్రటరీ బాలయ్య, ప్రచార కార్యదర్శి లింగం, లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఆజాద్ తదితరులు మాట్లాడుతూ సంఘ బలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు .

 

కమిటి సభ్యులు తిరుపతి, మొగులయ్య, రాజమణి, లావణ్య, పద్మ, రాజి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now