జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతుల ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్

జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్

ఎల్లారెడ్డి డివిజన్, కామారెడ్డి జిల్లా:

జాతీయ ఓబీసీ మహాసభ ప్రచార గోడప్రతులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది.

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చేతుల మీదుగా గోడప్రతుల ఆవిష్కరణ.

ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహణ.

29 రాష్ట్రాల నుండి 10,000 మంది ఓబీసీ ప్రతినిధులు హాజరు.

మహాసభలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ.

తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, విద్యార్థి సంఘం అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ – ‘‘దేశంలో ఓబీసీల హక్కుల కోసం పోరాటాన్ని ప్రగాఢంగా కొనసాగించేందుకు గోవాలో జాతీయ స్థాయిలో మహాసభ నిర్వహిస్తున్నాం,’’ అని తెలిపారు.ఈ సభను మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రకటించిన చారిత్రక రోజైన ఆగస్టు 7న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది 10వ జాతీయ ఓబీసీ మహాసభ కావడం విశేషం.సభకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, జాతీయ ఓబీసీ నేతలు ఆహ్వానితులుగా హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మార్కంటి భూమన్న, మాజీ జెడ్పీటీసీ మల్లన్న, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్, గోవర్ధన్, విద్యార్థి నాయకులు లింగమయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓబీసీ ఉద్యమాలకు మరింత ఊపందించాలని నేతలు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now