అమీర్పేట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో దారుణం
వారం క్రితం రక్తప్రసరణ జరిగే వాళ్స్ బ్లాక్ తో వచ్చిన కోదాడకు చెందిన ఎస్.కె మౌలానా (35 సంవత్సరాలు) కు స్టంట్ వేస్తామని హాస్పిటల్లో చేర్పించుకున్నారు. పేషెంట్ కు సంబంధించిన బంధువులు చాలా స్పష్టంగా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా అవుతుందా అని అడిగిన తర్వాత మాత్రమే అడ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మా దగ్గర స్పెషలిస్ట్ లు ఉన్నారంటూ పేషెంట్ ని అడ్మిట్ చేయించుకున్న హాస్పిటల్ యాజమాన్యం. మూడు రోజుల క్రితం సర్జరీ చేశాక కోమాలో నుండి బయటికి రాని పేషంట్ మౌలానా. తర్వాత అధికంగా బ్లీడింగ్ అవుతుందని 8 యూనిట్ల రక్తం అవసరమంటే అత్యవసరంగా 8 యూనిట్ల రక్తాన్ని తెచ్చి ఇచ్చిన కుటుంబ సభ్యులు. తర్వాత నుండి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామంటూ హాస్పిటల్ వర్గాలు చెబుతున్నారు అని తెలియజేసిన కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకి పేషంట్ దగ్గరికి వెళ్ళనివ్వలేదని ఈరోజు పేషంట్ కండిషన్ బాగాలేదని తెలియ చేస్తున్నారని చెప్పిన కుటుంబ సభ్యులు. 35 సంవత్సరాల ఎస్ కే మౌలానా తన రోజువారి కార్యకలాపాలు చాలా చురుగ్గా నిర్వహించుకునే వాడని చికిత్స నిమిత్తం ఆరోగ్యంగా వచ్చిన మౌలానాను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు చంపి వేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ఇప్పటివరకు తమకు చూపెట్టకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్న ఎస్ కే మౌలానా కుటుంబాన్ని రోడ్డుమీదికి తెచ్చారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.