దమ్మాయిగూడ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ను కలిసిన స్థానికులు
మాజీ కౌన్సిలర్ కొత్త సురేఖ ఆధ్వర్యంలో వినతి – కమిషనర్ వెంటనే స్పందన
మేడ్చల్ జిల్లా దమ్మైగూడ ప్రశ్న ఆయుధం ఆగస్టు 1
దమ్మాయిగూడ స్థానిక 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ కాలనీలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలైన మంచినీటి సరఫరా లోపం, కాలనీ శుభ్రత వంటి అంశాలపై కమిషనర్‌కు వివరంగా వివరించారు.
వినయపూర్వకంగా వినతిపత్రం అందజేసిన కాలనీవాసుల సమస్యలను కమిషనర్ వెంకట్ రెడ్డి సావధానంగా పరిశీలించి, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ స్పందనకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు కొత్త భాస్కర్ గౌడ్, కాలనీ మాజీ అధ్యక్షులు ఎం.కె. పెంటాజీ, కాలనీవాసి వరగంటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.