జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అర్బన్ మలేరియా పథకం 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అర్బన్ మలేరియా పథకం

ప్రశ్న ఆయుధం ఆగస్టు 01: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అర్బన్ మలేరియా పథకం కార్యక్రమంలో భాగంగా, దోమల నివారణ మరియు వాటి ద్వారా వ్యాపించే వ్యాధులపై స్కూల్ పిల్లలకు అవగాహన సదస్సు జరిపిన కార్యక్రమంలో కీటక శాస్త్రం డిపార్ట్మెంట్ వారితో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో ఎక్కువ రోజులు వాటర్ నిల్వ ఉండడం వలన దోమలు గుడ్లు పెట్టి దోమ పిల్లలను ఉత్పత్తి అవకుండా చూసుకోవాలని, అలానే దోమ కాటు ద్వారా డెంగ్యూ ఫీవర్ మలేరియా జ్వరం మరియు చికెన్ గునియా మరియు బోదకాలు మెదడు వ్యాపు మొదలగు వ్యాధులు వస్తాయి కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కువ రోజులు నీరు నిలువ లేకుండా చూసుకోవాలనీ, నేటి నిల్వలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచవలెను అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ సాయి కుమార్ , కీటక శాస్త్రం సూపర్వైజర్ నరసింహ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment