ఛత్రపతి శివాజీ నగర్ కాలనీలో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 01: కూకట్‌పల్లి ప్రతినిధి
124ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీలో డ్రైనేజీ సీసీ. రోడ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఛత్రపతి శివాజీ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీలోని ఒక గల్లీలో డ్రైనేజీ మూడు సీసీ.రోడ్లు పెండింగ్ ఉన్నాయని అన్నారు. సంబంధిత అధికారులతో ఎస్టిమేషన్ వేయించి, బడ్జెట్ మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా డివిజన్ లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేస్తానని తెలియచేసారు. కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, కాలనీఅధ్యక్షులు అంజయ్య యాదవ్, సెక్రటరీ కె.రమేష్, ఆర్.ఆంజనేయులు, కోటేశ్వరరావు, ఎల్.రాజు, పి.పోచయ్య, తాత బాబు, రాజ్యలక్ష్మి, సౌందర్య, అరుణ, కృష్ణవేణి, స్వరూపా, దేవి, యోగేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.