వజ్జపల్లి ఘటనపై స్పందించిన అధికారులు..
కామారెడ్డి జిల్లాసదాశివనగర్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 1
వ్యవసాయ బోర్లకు కరెంట్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్, అకస్మాత్తుగా కాలిపోగా
సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, హుటాహుటినబయలు దేరి స్పందించినఅధికారులు
“ఓవర్‌లోడ్ వల్లే మంటలు” అని అధికారుల వివరణ
“ముందే చెబితే పట్టించుకోలేదు… నష్టం జరిగాక వచ్చారు” అని రైతుల ఆగ్రహం
“సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఎందుకు?” అంటూ మండిపడ్డ వాజ్జ పల్లి రైతులు.
కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, సామర్థ్యం మేరకే కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్,
వివరాల్లోకి వెళితే…
సదాశివనగర్ మండలంలోని వజ్జపల్లి గ్రామంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్, ఒక్కసారిగా మంటలు పోసుకుంటూ దగ్ధమైంది. అధికారులకు సమాచారం అందగానే వెంటనే అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణం ఓవర్‌లోడేనని తేల్చేశారు.
అయితే ఇప్పటికే సామర్థ్యాన్ని మించి కనెక్షన్లు కలిపినదే మూలకారణమంటూ రైతులు ఘాటుగా స్పందించారు.
రైతుల ప్రధాన డిమాండ్లు:
1. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే బోర్లకు కనెక్షన్లు ఇవ్వాలి.
2. అదనపు లైన్ల కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.
3. రైతుల కోరిక మేరకు కొత్త ట్రాన్స్ఫారం బిగిస్తామని, సామర్ధ్యాన్ని, కూడా పెంచుతామని హామీ ఇచ్చిన అధికారులు.