Site icon PRASHNA AYUDHAM

_ లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం.

Screenshot 20250804 171417 1 1

_ లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం.

 

 

_ఈనెల 6 తేదీన కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మూడవ జిల్లా భారీ మహాసభలు.

 

ప్రశ్న ఆయుధం, ఆగష్టు 4

కామారెడ్డి జిల్లా సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించరు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న హాజరై మాట్లాడుతూ ఈనెల 6 తేదీన కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మూడవ జిల్లా మహాసభ కామారెడ్డి పట్టణం కేంద్రంలో మున్నూరు కాపు సంఘం వీక్లీ మార్కెట్ లో జరుగుతాయని అన్నారు.ఈ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే, మరియు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ , సిపిఐ సీనియర్ నాయకులు వీ ఎల్ నరసింహారెడ్డి ప్రముఖ న్యాయవాది ఈ మూడో మహాసభలకు హాజరవుతారని ఆయన అన్నారు . ఈ మహాసభలు దేశంలో రాష్ట్రంలో లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నిరుపేద మధ్యతరగతి అన్యాయానికి సంబంధించిన బ్యాంకింగ్ ఎల్ఐసి రైల్వే రవాణా రంగం అడవి ఖనజ సంపద సింగరేణి వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు సిపిఐ గ్రామ కార్యకర్తలు సానుభూతిపరులు జిల్లా ప్రజలు తరలి రావాలని ఆరవ తేదీన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మున్నూరు కాపు సంఘానికి చేరుకోవడం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలు విజయవంతం చేయాలని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న , సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, జిల్లా నాయకులు జి మల్లేష్ ,ప్రవీణ్ ,నరేష్ లు పాల్గొన్నారు.

Exit mobile version