*_ఐ.డీ.ఓ.సీ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అదనపు కలెక్టర్_*
నిజామాబాద్, డిసెంబర్ 12 : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు.