_కష్ట సుఖములు జీవితములో భాగములు. అన్నీ సుఖాలే వస్తే జీవితాన్ని ఆస్వాదించలేరు._

*_భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే, సంసార సాగరంలో, మునిగి ఉంటూంటే ఇంకా, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది..?_*

*_సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు._*

*_నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం వుండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది…_*

*_లేదా …మనకు పార్ట్ టైమ్ భక్తి వుంటే ఆయనకి కూడా మన మీద పార్ట్ టైమ్ దయ వుంటుంది._*

*_కష్ట సుఖములు జీవితములో భాగములు. అన్నీ సుఖాలే వస్తే జీవితాన్ని ఆస్వాదించలేరు._*

*_పది రోజుల పాటు ఏదైనా తీపి తింటే పదకొండవ రోజు తీపి మీద విరక్తి కలుగుతుంది._*

*_నాలుకకు అప్పుడప్పుడూ చేదు కూడా ఉండాలి._*

*_దేవతలు, దానవులు కలిసి పాల సముద్రమును మధించారు._*

*_ముందు హాలాహలం పుట్టింది. కాని, వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు. ఫలితంగా అమృతం పుట్టింది._*

*_మనలో ఉన్న మంచి చెడులే దేవతలు, దానవులు. వాటి మధ్య జరిగే ఘర్షణ పాలసముద్రం చిలకడం._*

*_ముందు కష్టాలు వస్తాయి. ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్పించాలి. తుదకు అనంతమైన సుఖం లభిస్తుంది._*

*_కష్ట సుఖాలు దైవీ ప్రసాదాలు. అవి నిన్ను దృఢపరచడానికి, నిన్ను నిన్నుగా మలుచుకోవడానికి వచ్చిన సాధనలు._*

*_కష్టంలో నైనా, సుఖంలోనైనా సమ భావాన్ని, స్థితప్రజ్ఞత అలవర్చుకో ఇదే జీవిత పరమార్ధం!_*

 

Join WhatsApp

Join Now

Leave a Comment