Site icon PRASHNA AYUDHAM

ఆత్మహత్యా కు గంజాయి బ్యాచ్ కారణమంటూ

IMG 20240809 WA0126

*సంగారెడ్డి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య?*

సంగారెడ్డి జిల్లా:ఆగస్టు09
యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. దోమ డుగు గ్రామానికి చెందిన తేజేశ్వ‌ని బీఫార్మసీ చదువు తోంది. తనను ప్రేమించా లంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థినినీ, ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నారు.

దీనిపై పెద్ద‌లు జోక్యం చేసు కుని పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగ‌లేదు.. దీం తో ఏమీ తోచని పరిస్థితుల్లో ఆ యువ‌తి తాను ఉంటున్న‌ భవనం నాలుగు అంతస్తుల‌ పై నుండి కిందకు దూకి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు యువ తిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలో తేజేశ్వ‌ని మృతి చెందింది.. ఆత్మ‌హ‌త్య‌కు గ్రామంలోని గంజాయ్ బ్యాచ్ కార‌ణ‌మంటూ బంధువులు ఆందోళ‌న‌కు దిగారు..

నిందితుల‌ను ఉరితీయాలం టూ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version