*అనాధాశ్రమంలో బిజెపి నాయకుని జన్మదిన వేడుకలు*
*పుట్టినరోజు అనాధ పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 5*
భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధాశ్రమంలోని అనాధ పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు అనాధ పిల్లలతో కలిసి వారి మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రాజేష్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజలకోసం పోరాటాలు చేయడం తన తండ్రి సీనియర్ నాయకులు దివంగత రవి ఠాకూర్ చూసి నేర్చుకోవడం జరిగిందని తన అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయిలో ఉండడం వారి తండ్రి ప్రోత్సాహంతో వారిని ఆదర్శంగా తీసుకొని మునుముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అనాధ పిల్లల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో దొంతుల రాజ్ కుమార్ మోతే స్వామి తూడి రవిచందర్ రెడ్డి ఇటుకల స్వరూప రాకేష్ ఠాగూర్ తాటి కంటి మల్లేశం ఇల్లందుల శ్రీనివాస్ కనుమల్ల లక్ష్మి కొండ్లె సులోచన ఎండి ఫీర్ మహమ్మద్ పర్లపల్లి సమ్మయ్య మోతే అర్జున్ ఎండి అఫ్రజ్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.