Site icon PRASHNA AYUDHAM

పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు 

 

పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కళాశాల ఎన్, ఎస్ ,ఎస్ యూనిట్ I&II మరియు భద్రాచలం సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించిరి ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ జాన్ మిల్టన్  అధ్యక్షత వహించి రక్తదానం చేయండి ప్రాణదాతగా ఉండండి రక్తపు సంచి ఎవరికైనా ప్రాణాధారం కావచ్చు అని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పి ఓ బి సుధాకర్ రావు& డాక్టర్ కిరణ్ కుమార్ సిఐ సంజీవరావు ఎస్సై విజయలక్ష్మి మరియు ట్రాఫిక్ ఎస్ఐ మధుబాబు  పాల్గొని రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు కళాశాల నుంచి జూనియర్ అసిస్టెంట్ ఎల్ కిరణ్ కుమార్ పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు రవి ప్రసాద్ మొదలగువారు రక్తదానం చేసిరి ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Exit mobile version