నిరుద్యోగులు, రైతులు, గ్రామీణ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ లో కేటాయింపులు
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ ప్రశ్న ఆయుధం బ్యూరో జూలై 23
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని ప్రధానంగా నిరుద్యోగులు, రైతులు, గ్రామీణాభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యతను ఇచ్చి బడ్జెట్లో తగిన నిధుల కేటాయింపులు చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా 9 ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుందని వ్యవసాయ రంగంలో ఉత్పాదక ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారి -సేవలు లాంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుందన్నారు. ముఖ్యంగా యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజీ తీసుకువచ్చిందని ఈ బడ్జెట్లో యువతపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టిందన్నారు విద్యా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిందని దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించి ఉపాధిరంగం ఏదైనా తొలి వేతనం కింద రూపాయలు 15,000 నగదు బదిలీ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం సంతోషకరమని విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటును అందించడానికి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం రూపాయలు 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం ముద్ర లోన్ పరిమితి రూపాయలు 20 లక్షల పెంపు చేయడం హర్షణీయమన్నారు అలాగే వ్యవసాయానికి అనుబంధ రంగాల కోసం రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారని వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి సేధ్యాన్ని చేసేలా చర్యలు చేపట్టడం గ్రామీణాభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామం అని మహిళలకు బాలికలకు లబ్ధి చేర్చే పథకాల కోసం మూడు లక్షల కోట్లు గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం రు.11.11 లక్షల కోట్లు కోటి గృహాలు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన 100 నగరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీల తగ్గింపు, ఐదేళ్లలో కోటిమంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్న షిప్ పథకం ప్రధానమంత్రి అన్నా యోజన మరో ఐదేళ్ల పొడిగింపు లాంటి అనేక అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యతని ఇచ్చారని ఆయన తెలిపారు