కూర్చుని కాపాడుకునే బడ్జెట్

*ప్రధాని కుర్చీని కాపాడుకునే బడ్జెట్ *:రాజీవ్ కుమార్*

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డుని ఇచ్చింది

  • ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు,జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్
    ప్రశ్న ఆయుధం 24జులై
    కామారెడ్డి:
    జిల్లా కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆదాని, అంబాని లకు కట్టబెట్టడానికి కేవలం ప్రధానమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు కూడా పలకనంత వివక్ష ఎందుకని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బీహార్ ,గుజరాత్ మాత్రమే ఉన్నాయా, విభజన హామీలలో తెలంగాణ అభివృద్ధి కూడా ఉందని విషయం కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ లేదా తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది ఎంపీ సీట్లు ఇందుకేనా అని అన్నారు. తెలంగాణలో యువత , నిరుద్యోగులు లేరా ఐఐఎం ఐటీ కారిడార్ అవసరం లేదా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. గుజరాత్ బుల్లెట్ రైలుకు ఇచ్చే బడ్జెట్ కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం ముమ్మాటికి విపక్ష చూపడమేనని అన్నారు. వర్తమానంలో అభివృద్ధి జరిపే ఆలోచన లేని వివక్ష చూపే తత్వం కలిగిన ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వానికి 2047 విజన్ అనేది గాల్లో మేడలు కట్టినట్టుగా ఉందని 50 సంవత్సరాల లో ఎన్నో సంక్షోభాలు విపత్తులను ఎదుర్కొని దేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను చిరు వ్యాపారులను విస్మరించి కేవలం మిత్ర పక్షాలకు దోచిపెట్టె బడ్జెట్ అని తెలంగాణకు నిధులు తీసుకొచ్చే సత్తా లేని మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజీనామా చేయాలని అన్నారు.

Join WhatsApp

Join Now