జీపీవో సంఘ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని పిలుపు
ఉద్యోగుల హక్కులు–ఐక్యతపై ఆదివారం సుందరయ్య విజ్ఞానభవన్‌లో చర్చ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22:
గ్రామపాలన అధికారులు (జీపీవోలు) తమ హక్కులు, ఐక్యత కోసం ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీజీఆర్ ఎస్ఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరంజీవి పిలుపునిచ్చారు. కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, వీఆర్ఏల పోరాట ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వం జీపీవోలుగా గుర్తించిందన్నారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్‌లో జరిగే ఆవిర్భావ సభకు రెవెన్యూ జేఏసీ గౌరవాధ్యక్షుడు లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హాజరవనున్నారని తెలిపారు. సంఘ ప్రతినిధులు మాణిక్యం, సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.