*క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మన్మోహన్ సింగ్ మృతికి ఘన నివాళులు*
*పట్టణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్*
జమ్మికుంట డిసెంబర్ 27 ప్రశ్న ఆయుధం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని వారి మృతికి జమ్మికుంట పట్టణంలో పట్టణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగ శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండీ ర్యాలీ నిర్వహించి మన్మోహన్ సింగ్ మృతికి ఘన నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందనీ,
మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని అన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదనీ తెలిపారు 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా అనేక గొప్ప చట్టాలను తీసుకొచ్చి పెనుమార్పులు చేశారని, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, లోక్ పాల్ బిల్లు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక చట్టాలను అమలు చేసిన ఘనత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు క్రమశిక్షణకు మారు పేరు నమ్మిన సిద్ధాంతం జీవితకాలం ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ అని ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని
దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్ అని ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షానా ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జు తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు పుదరి రేణుక శివకుమార్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాగర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శులు అజయ్, రవి, నాయకులు లింగరావు, ప్రశాంత్, సంపత్, అశోక్, అరవింద్, రాజేందర్, రాజు, సూర్య, రాజ్ కుమార్, జావిద్, ఆశ్రఫ్, సల్మాన్, సురేష్, వేణు,హరీష్, నాగ, మరియు విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.