*హైదారాబాద్*
కుక్కని అంబులెన్సులో తీసుకెళ్తున్న డ్రైవర్..సైరన్ మోగించుకుంటూ వెళ్తుండగా ఆపిన పోలీసులు…కుక్కకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్నానన్న డ్రైవర్ , అంబులెన్సుల సైరన్ దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టిన పోలీసులు..
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీల్లో బయటపడిన కుక్క వ్యవహారం, పోలీసులు తనిఖీ చేస్తుండగా అతి వేగంగా సైరన్ తో అక్కడకు వచ్చిన అంబులెన్స్ .లోపల రోగి ఉన్నాడా లేడా.. అని చూసేందుకు డోర్ తీసిన ట్రాఫిక్ పోలీసులకి షాక్.డోర్ తీయగానే కుక్కని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు కుక్కను అంబులెన్సులో ఇలా పేషంట్ మాదిరిగా..సైరన్ మోగించుకుంటూ ఎందుకు తీసుకెళ్తున్నావంటూ..ప్రశ్నిస్తే..మియాపూర్ లో కుక్కకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాని చెప్పిన డ్రైవర్ లోపల పేషంట్ లేకపోయినప్పటికీ సైరన్ ని దుర్వినియోగం చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..