శివ్వంపేట ట్రాన్స్కో ఏఈపై వేటు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి మెదక్ సర్కిల్ శివ్వం పేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి.దుర్గా ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ చీఫ్ ఇంజి నీర్, రూరల్ జోన్ పి. భిక్షపతి మంగళ వారం ఆదేశాలు జారీ చేశారు. ఒక పనికి సంబంధించి ఎస్టిమేషన్ తయారు చేసి, వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయడానికి దుర్గాప్ర సాద్ లంచం డిమాండ్ చేస్తున్నారని సీఎండీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్కు బాధిత కాంట్రా క్టర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై చేసిన క్షేత్రస్థాయి విచారణలో ఆరోప ణలు రుజువు కావడంతో శివ్వంపేట ఏఈ దుర్గాప్రసాద్ను సస్పెండ్ చేశారు.

Join WhatsApp

Join Now