Site icon PRASHNA AYUDHAM

నకిలీ బంగారు కేటు గాళ్ళపై కేసు నమోదు

మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఇండల్ మనీ మణుగూరు బ్రాంచ్ వారు తమ బ్రాంచ్ లో వంశీకృష్ణ మరియు పూజారి శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారు గాజులు పెట్టి లోన్ లు తీసుకున్నారని ఫిర్యాదు చేయగా అట్టి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.

అదే విధంగా మణుగూరులో ఇద్దరు వ్యక్తులు మరి కొంతమంది వారి స్నేహితుల ద్వారా ప్రవేటు బ్యాంకుల్లో మరియు గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో చాలా చోట్ల ఇదేవిధంగా నకిలీ బంగారు గాజులు మరియు ఇతర బంగారు ఆభరణాలు పెట్టి కూడా లోన్లు తీసుకోవడం జరిగిందని మా విచారణలో తెలిసింది.

అయితే ఇట్టి విషయాన్ని స్థానికంగా ఉన్న కొందరు గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మేనేజర్లు ఈ విషయాన్ని దాచిపెట్టి వారు కూడా అట్టి నకిలీ బంగారపు గాజులను మరియు నకిలీ బంగారపు ఆభరణాలను ఆన్లైన్లో పెట్టి అమాయకపు కస్టమర్లకు విక్రయించడం జరిగింది.

ఇందులో భాగంగా మణుగూరు లో ఉన్న A.U స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే ఫైనాన్స్ సంస్థ వారు ఇటీవల గోల్డ్ యాక్షన్ లో ఇట్టి నకిలీ బంగారపు ఆభరణాలను అమాయకపు కష్టమర్లకు 13 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా తెలిసింది

తద్వారా వారు ఆ బంగారపు ఆభరణాలను వెరీఫై చేయగా అది నకిలీ అని తెలిసి వారు పోలీస్ స్టేషను సంప్రదించడం జరిగింది*l

ఇందుమూలంగా మణుగూరు మండల మరియు పరిసర ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ప్రైవేటు మరియు ప్రభుత్వ సంబంధిత బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలకు తెలియజేయునది ఏమనగా

మీ వద్ద పూజారి శ్రీనివాస్ మరియు వంశి అన్న వ్యక్తులు మీ సంస్థలలో నకిలీ బంగారు గాజులు లేదా ఇతర ఆభరణాలు మీ దగ్గర ఏదైనా ఆభరణాలు లోన్ పెట్టినట్లయితే అట్టి ఆభరణాలు చెక్ చేసి వాటికి సంబంధించిన సమాచారం వెంటనే మణుగూరు పోలీస్ శాఖ వారిని సంప్రదించాల్సిందిగా తెలియజేయడమైనది.

 

Exit mobile version