పంట చేను నష్టం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

*పంట చేను నష్టం చేసిన వ్యక్తి పై కేసు నమోదు*

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*

పత్తి పంట చేను పీకి వేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఇల్లందకుంట ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు గురువారం రోజున శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ తిరుపతి అనే అతను భూమి తగాదాల కారణంగా తన అన్న అయినా అంబరగొండ సంజీవరావు పత్తి చేనులో అక్రమంగా ప్రవేశించి పత్తి మొక్కలను పీకేయడం జరిగిందని పీకేసిన మొక్కల విలువ సుమారుగా 10,000 రూపాయలు అవుతుందని దగ్గరికి వెళ్లిన సంజీవరావు భార్యను బూతు మాటలు తిట్టడం జరిగిందని మరోసారి భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరించగా పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితుడు సంజీవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు

Join WhatsApp

Join Now